
శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాపిరెడ్డినగర్ నాయకులు
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పాపిరెడ్డినగర్కు చెందిన నాయకులు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాపిరెడ్డినగర్ కాంటెస్టెడ్ అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని శాలువాతో సన్మానించి, పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచు కుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా గాంధీ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రజా సమస్యలపై స్పందిస్తూ, నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజలతో మమేకమై, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాపిరెడ్డినగర్ సీనియర్ నాయకులు ఈ. రెడ్డి దేవేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎడ్ల సంపత్ రెడ్డి, డాకురి అక్కిరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.