
పయనించే సూర్యుడు న్యూస్ :గోదావరిఖనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసిన బండి సంజయ్ ఆలయాలను కూల్చివేయడంపై మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని విస్తరణలో భాగంగా కూల్చివేశామంటూ అధికారులు చెప్పడంతో రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి వాటిని ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. దీనిపై అధికారులు నీళ్లు నమలడంతో ఏం తమాషా చేస్తున్నారా? ఎవరి మెప్పు కోసం మూకుమ్మడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారు? ఆటోడ్రైవర్ల అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారన్నారు. భక్తులు నిత్యం దర్శించుకుంటారని, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తారా? భక్తుల మనోభావాలు పట్టవా? పోనీ అదే రోడ్డుకు అడ్డంగా అక్కడ మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి వాటినెందుకు కూల్చివేయలేదు? హిందువులంటే అంత చులకనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు 48 గంటలు సమయం ఇస్తున్నా. కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునరుద్దరించాలన్నారు. లేకపోతే దారికి అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలన్నారు. లేనిపక్షంలో నేను గోదావరికి వస్తానని, దగ్గరుండి మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయిన వెంటనే గోదావరిఖని వస్తానన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోసహా అధికారులందరినీ ప్రజల మందు నిలబెడతానన్నారు. జరగనున్న పరిణామాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం తదుపరి కార్యాచరణపై పెద్దపల్లి జిల్లా నేతలతోపాటు పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చలు