

పయనించే సూర్యుడుD.26.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఈరోజు శనివారం రోజున మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ అన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భీంగల్ పట్టణంలోని చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ అన్నఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండిన జీవితం, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నె సురేందర్,బొదిరె స్వామి, JJ నర్సయ్య, పర్స అనంత రావు, నాగేంద్ర బాబు, సుంకరి సురేష్, అనిల్ గౌడ్, పర్స రత్నం, బొమ్మెన అజయ్ తదితరులు పాల్గొన్నారు.