
"కూటమి ప్రభుత్వం లో గ్రామ పంచాయతీలకు కళ
పయనించే సూర్యుడు నవంబర్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో గ్రామ పంచాయతీలకు సుమారు 3కోట్ల 27 లక్షల సిమెంట్ రోడ్డు పనులు మంజూరు.
ప్రారంభమైన పనులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో ఈ రోజు శనివారం నూతక్క వారి కండ్రిక పంచాయతీలో ఎస్టీ కాలనీలో ఎం జి ఎన్ ఆర్ ఇ జిఎస్ నిధుల కింద 12 లక్షలతో సిమెంటు రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్,చేజర్ల మండల తెలుగు యువత అధ్యక్షులు రాజాల ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సీహెచ్.రామానాయుడు,లక్కు పెంచలరెడ్డి,చంద్ర గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
