
( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ స్థానిక ఠాగూర్ హైస్కూల్లో శనివారం రోజు సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వివిధ శాస్త్రీయ అంశాలపై విద్యార్థులు ఆకర్షణీయమైన ప్రాజెక్టులు, మోడల్స్‌ను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి, నీటి సంరక్షణ, రోబోటిక్స్ వంటి విభాగాల్లో సృజనాత్మక ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ప్రముఖులు హాజరై విద్యార్థులను అభినందించారు.పాఠశాల ప్రిన్సిపాల్ అంజలి మాట్లాడుతూ “ఈ సైన్స్ ఫెయిర్ విద్యార్థులలో సృజనాత్మకత, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తుంది” అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
