
ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కడియాలకుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్
( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బూరుగుల గ్రామానికి చెందిన గంగాపురం శివకుమార్ మృతి చెందడం జరిగింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ 5000 రూపాయలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు బుజ్జి రాజు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుజ్జిరాజు నాయక్ ,రాజు, చింటూ తదితరులు పాల్గొన్నారు.
