
*లబ్ధిదారులకు కార్డులు అందజేసిన సర్పంచ్ ధరావత్ కృష్ణ నాయక్:*
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 26 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:చివ్వెంల:సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ కృష్ణ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు 110 స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానో రాజు నాయక్,పంచాయతీ కార్యదర్శి లలిత వార్డు సభ్యులు మహేష్ మహేందర్,రామచంద్రు,గ్రామ శాఖ అధ్యక్షుడు మాధవరావు పాల్గొన్నారు. గ్రామ యువకులు సుమన్, రామాచారి నరేష్ రెడ్డి వీరన్న, సాయి, లింగ చిట్టిబాబు సైదులు, వెంకన్న,బ్రహ్మచారి వేణు, చీనా,కవిత,భద్రమ్మ తదితరులు హాజరయ్యారు