
పయనించే సూర్యుడు నవంబర్ 10, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసిన విద్యార్థి యువజన సంఘాలు
"నాగేంద్ర ని సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం."
స్థానిక నంద్యాల పట్టణం జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన కార్యక్రమం నందు బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు హెచ్ డబ్ల్యు ఓ వార్డెన్ నాగేంద్ర సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్, నేషనల్ ట్రైబల్స్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నాగ సారి సుంకన్న, తెలుగు రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల జయరాజు, గిరిజన విద్యార్థి సమైక్య రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ ముడవత్ రవీంద్ర నాయక్,బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలుట్ల రమణ మాట్లాడుతూ ఈనెల అనగా 03/11/2025 వ తేదిన బనగానపల్లె బిసి బాలుర వసతి గృహం నందు 9వ తరగతి చదువుతున్న టీ. అల్తాఫ్.ప్రకాష్ అనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి ఉదయం 8.00 am గంటలకు బయటికి వెళ్లిపోవడం జరిగిందని వారు హాస్టల్ నుంచి అదృశ్యమై రెండు రోజులు అవుతున్నా కూడా విద్యార్థి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేయకుండా విధులను నిర్లక్ష్యం చేశాడని రెండవ రోజు అల్తాఫ్ అనే విద్యార్థి వెల్దుర్తి మండలం పక్కన ఒక చిన్న ఊర్లో యాక్సిడెంట్ అయ్యి కాలు మరియు చెయ్యి విరిగిపోయి పడిపోయి ఉన్నాడని ఆ విద్యార్థి అమ్మమ్మకు స్థానికులు సమాచారం తెలియజేయడంతో ఆ విద్యార్థి అమ్మమ్మ హుటాహుటిన వెళ్లి ఆ విద్యార్థిని తీసుకోవడం జరిగిందని ఈ విషయం మీద ఆ విద్యార్థి అమ్మమ్మ చరవాణి నందు హాస్టల్ వార్డెన్ నాగేంద్ర కు విషయం మీద తెలియజేయగా మీ మనవడు హాస్టల్ నుంచి పారిపోయితే మాకు ఏం సంబంధం నీ పెంపకం అలా ఉంది కాబట్టే పారిపోయాడు వాడు, ఆ పిల్లవాడు సచ్చిన మాకు సంబంధం లేదంటూ విద్యార్థి యొక్క అమ్మమ్మతో అసభ్యకరంగా దుర్భాషలాడిన బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు వార్డెన్ నాగేంద్రను తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ జిల్లా డిఆర్ఓ రాము నాయక్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది

