
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తానూర్ మండలంలోని బోసి గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో భైంసా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జె ఎఫ్ సి ఎం) వెంకటరమణ సుహాస్ గారి ఆధ్వర్యంలో పోక్సో (పి ఓ సిఎస్ఓ) చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌరవనీయ న్యాయమూర్తి గారు విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులు, వాటి నుంచి రక్షణ పొందే విధానాలు, బాలల హక్కులు మరియు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి వివరించారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే ఇబ్బందులు లేదా వేధింపుల గురించి భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాలల భద్రత, రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల ని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తానూర్ ఎస్ఐ షేక్ జుబేర్ పాల్గొని, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.