
"పాఠశాల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి "
(పయనించే సూర్యుడు నవంబర్ 10 రాజేష్)
ఈరోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ నందు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి హాజరై యూ డైస్ ప్లస్ ద్వారా పాఠశాల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొరపాట్లు లేకుండా పొందుపరచాలని సూచించారు. తరగతి గది సమయంలో పాఠశాలల్లో చరవాణి ని ఎవరు కూడా ఉపయోగించొద్దు అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులు తప్పకుండా ఒక గుర్తింపు హాజరు అప్డేట్ ఉండాలని సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వహణ మెనూ ప్రకారం ఉండాలని ఆన్లైన్లో హాజరు నమోదు తప్పకుండా పొందుపరచాలని సూచించారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా సంబంధించినటువంటి యాప్ ద్వారా విద్యార్థులకు IFP ప్యానెల్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అఫ్జల్ హుస్సేన్ స్థానిక పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు వెంకట్ లక్ష్మి మండల వనరుల కేంద్రం సిబ్బంది పెంటయ్య శేఖర్ మల్లేశం సిఆర్పిలు రాజు, చంద్రమౌళి,కుమార్,నగేష్ పాల్గొన్నారు.
