
పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు.. సోమవారం, మంగళవారం భారీగా పెరిగాయి.. మంగళవారం పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,500 వరకు ధర పెరిగింది. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర పెరిగితే.. మరికొన్ని రోజులు తగ్గుతూ వస్తాయి. తాజాగా.. 10 గ్రాముల పసిడిపై రూ.2,460 మేర ధర పెరిగింది. ఇక వెండి కిలోపై రూ.3వేల మేర ధర పెరిగింది. మంగళవారం (నవంబర్ 11 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,460 మేర పెరిగి.. రూ.1,26,280 గా ఉంది.
22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.2,250 మేర రేటు పెరిగి.. రూ.1,15,750 గా ఉంది.
వెండి కిలోపై రూ.3,000 మేర ధర పెరిగి.. రూ.1,60,000 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,280 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,15,750 ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,26,280, 22 క్యారెట్ల ధర రూ.1,15,750 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,430, 22 క్యారెట్లు రూ.1,15,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,60,000లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,26,280, 22 క్యారెట్లు రూ.1,15,750 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,60,000 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,27,640, 22 క్యారెట్ల ధర రూ.1,17,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,70,000లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,26,280, 22 క్యారెట్ల ధర రూ.1,15,750 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,60,000 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.