
పయనించే సూర్యుడుD.27.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ పీకే గంగాధర్. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుతో మర్యాదగా ప్రవర్తించాలి ప్రతి ఒక్కరూ పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా కృషి చేయాలి ఆర్మూర్ సబ్ డివిజన్ లోని మెండోరా పోలీస్ స్టేషన్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,* నేడు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జరిగింది. అనంతరం సిబ్బందికి సంబంధించినటువంటి కిట్ ఆర్టికల్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తదుపరి పోలీస్ స్టేషన్లో పూర్తిగా కలియతిరిగారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని కేసుల నమోదు , దర్యాప్తు పురోగతి , పెండింగ్ కేసులు , ఫిర్యాదుల పరిష్కారం , స్టేషన్ రికార్డుల నిర్వహణ , సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు.మహిళలు , బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు త్వరితగతిన స్పందించి, బాధితులకు భరోసా కల్పిస్తూ , చట్టపరమైన నిబంధనల ప్రకారం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా బాధితులు తమ సమస్యలను ఎటువంటి భయాందోళనలు లేకుండా పోలీసులకు తెలియజేసే విధంగా వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు.అదేవిధంగా మహిళలు , బాలికలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును నిర్లక్ష్యం చేయకుండా , ప్రతి కేసును సున్నితమైన అంశంగా పరిగణిస్తూ , అవసరమైన ఆధారాలను సేకరించి , దర్యాప్తును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు.కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు , బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్లోని వివిధ రికార్డులు , కేసు ఫైళ్లు , పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి , దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.మెండోరా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా , గౌరవంగా వ్యవహరిస్తూ , వారి సమస్యలను ఓర్పుతో విని , చట్టపరమైన పరిష్కారం చూపాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మహిళలు , బాలికల భద్రతకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల ని తెలిపారు. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని , అదే విధంగా ముందస్తుగా రాబోయే రోజుల్లో పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని సిబ్బంది అందరూ ప్రిపేర్ అయి ఉండాలని , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని , సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని , ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, సి.సి.ఆర్.బి ఎ.సి.పి శ్రీ గురు నాయుడు , ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ జన్ రెడ్డి, మెండోరా ఎస్ ఐ జె.సుహాసిని మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
