
పయనించే సూర్యుడు న్యూస్ : నార్త్ బ్యూటీ రుహానీ శర్మ కెరీర్ మాత్రం సౌత్‌లోనే కంటిన్యూ అవుతోంది. తెలుగు ప్రేక్షకులను ఆమె చి!ల!సౌ సినిమాతో పలకరించింది. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతోనే దర్శకుడిగా మారారు. సినిమా మినిమం బడ్జెట్లో సుశాంత్, రుహానీశర్మ జంటగా రూపొంది చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. హిట్ సిరీస్‌లో హిట్ ది ఫస్ట్ కేస్, డర్టీ హరి చిత్రాలతో పాటు హర్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ ఆమె నటించింది. వీటిలో హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా హిట్ అయ్యింది. డర్టీ హరి కమర్షియల్‌గా హిట్ అయినప్పటికీ రుహానీకి మాత్రం క్రెడిట్ దక్కలేదు. నెమ్మదిగా రుహానీ శర్మకు అవకాశాలు తగ్గిపోయాయి. సోషల్ మీడియాలోనే ఆమె యాక్టివ్‌గా మారింది. అడపా దడపా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ ముద్దుగుమ్మకి ఓ క్రేజీ మూవీలో బడా స్టార్ పక్కన నటించే అవకాశం దక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. ఆకాశంలో ఒక తార.. అందులో నటించబోయే హీరో ఎవరో కాదు.. దుల్కర్ సల్మాన్. ఈ మలయాళ స్టార్ హీరో ఇప్పుడు తెలుగులో రెండు మూవీస్ చేస్తున్నాడు. అందులో ఆకాశంలో ఒక తార. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఒక హీరోయిన్గా రుహానీ నటిస్తుంటే.. మరో హీరోయిన్గా సాత్విక వీరవల్లి అనే కొత్త హీరోయిన్ నటిస్తోంది. ఆకాశంలో ఒక తార సినిమాను స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్‌తో కలిసి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆకాశంలో ఒక తార మూవీపైనే రుహానీ ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి హీరోయిన్గా టాలీవుడ్లో బిజీ కావాలని ఆశపడుతోందీ సొగసరి. మరి ఆమె ఆశలు నేరవేరుతాయో లేవో మరి చూడాలి.