

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఎస్సై ఎల్. రామ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు, రోడ్డు భద్రత నియమాలు, షీ టీం పై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే లేదా ఆన్లైన్ వేధింపులు ఎదురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని బృందం, విద్యార్థినిలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.