
"గొడుగుపల్లి అడవిలో చిరుత పులి వివరాలను వెల్లడించిన పారేసి రేంజి అధికారి సందీప్ కుమార్'"
(పయనించే సూర్యుడు నవంబర్ 10 రాజేష్)
దౌల్తాబాద్ మండల గొడుగుపల్లి అడవిలోని ఒప్పోదలో దాగి ఉన్న చిరుత పులి నక్కిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గొడుగు పలికి చెందిన చందాభక్షపతి తెలిపిన వివరాల ప్రకారం చందా భిక్షపతి రోజు మాదిగని తన వ్యవసాయ పొలం వద్దకు పశువులను వెళుతున్న క్రమంలో ఒక చిరుత పులి ఆవు పశువుల పైకి దాడి చేసే ప్రయత్నం చేసిందని భయంతో నేను కేకలు వేయడంతో చిరుత పులి వెనుకకు వెళ్ళిపోయిందన్నారు. తన వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో పక్కన ఉన్న జత్రం తండా రైతులు కడతార్ రాములు చందర్ శ్రీకాంత్ వద్దకు బిక్షపతి వెళ్లి చిరుతపులి విషయం తెలిపాడు. ఒక పొదల చిరుత పురుగు ఎక్కింది చిరుతపులి సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం తెలుసుకున్న దుబ్బాక రేంజ్ అధికారి సందీప్ కుమార్ సెక్షన్ ఆఫీసర్ హైమాద్ బీట్ ఆఫీసర్ వేణు గొడుగుపల్లిఅడవి ప్రాంతానికి వెళ్లారు. పొదల్లో నెక్కిన చిరుత పులిని పరిశీలించి గుర్తించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి సందీప్ కుమార్ మాట్లాడుతూ గొడుగుపల్లి పక్కన జత్రం తండా మధ్యలో గొడుగుపల్లి అడవిలోని ఓపదలో దాగి ఉన్న చిరుత పులిని గుర్తించామన్నారు . చిరుత పులి ఎక్కడో వేట చేసి ఉండొచ్చని ఆ స్థితిలోనే చిరుత పులి కాళ్ల మీద నిలబడి ఉంటూ ఇటు కదలవుతుంది ఆ తప్ప ఆ చిరుత పరిగెత్తలేని పరిస్థితుల్లో లేదని తెలిపారు. ప్రస్తుతం ఆ చిరుత పులికి నీళ్లు కానీ హారము కానీ రెండు రోజులు వరకు అవసరం లేదన్నారు వయసు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చిరుత సమాచార హైదరాబాద్ స్పెషల్ టీంకు సమాచారం అందించమన్నారు. స్పెషల్ టీం సమాచారం ప్రకారం చిరుత పులి అక్కడ ఎందుకు దాగి ఉందని దానికి ఏమైందని స్పెషల్ టీం తెలిపిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెటర్నరీ వైద్యాధికారులకు సమాచారం ఇచ్చామని చిరుత హెల్దిగా ఉందా లేదా అనే విషయాన్ని వెటర్నరీ వైద్యులు పరిశీలించి గుర్తిస్తారని తెలిపారు. రైతులు ఎవరు ఆ చుట్టుపక్కల పొలాల వద్దకు వెళ్ళొద్దని సమాచారం ఇచ్చారు.
