
"ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాదంశెట్టి భద్రయ్య Ex .సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు"
(పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్)
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారంలో చివరి రోజైన నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్ పేట డివిజన్ ఎన్నికల ప్రచారంలో పరిధిలో సమతా కాలనీలో వార్డులలో దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు మరియు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ప్రచారం చేయడం జరిగింది. మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలిసి ఎన్నికల ప్రచార నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ ఓటాలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. చేతి గుర్తుపై ఓటు వేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీకి అండగా నిలవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇచ్చి మీ విలువైన ఓటుతో ఆదరించాలని కోరడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం అందించే చేతు గుర్తుపై మీ విలువైన ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించవలసిందిగా కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం భాగంగా వారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాదంశెట్టి భద్రయ్య EX సర్పంచ్. దార సత్యనారాయణ మల్లేశం పల్లి .సర్పంచ్. దశరథ రెడ్డి మాజీ మండలాధ్యక్షులు. మాచిన్ పల్లి స్వామి కాంగ్రెస్ నాయకులు యూత్ ప్రెసిడెంట్. బాలకృష్ణ కాంగ్రెస్ నాయకులు. దౌల్తాబాద్ మండల ఉపాధ్యక్షులు. రెడ్డిపల్లి శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
