
పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణంపై.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. దాదాపు పొడి వాతావరణం ఉంటుందని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిన్నటి ఉత్తర అంతర తమిళనాడు ప్రాంతం – దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:- మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు : హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నవి.. వీటి ప్రభావంతో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుండి రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.