
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
కోడిచర్ల మైసమ్మ గుడిలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రత్యేక పూజలు
పెంజర్ల ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు
( పయనించే సూర్యుడు నవంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కోడిచర్ల గ్రామంలోని ప్రసిద్ధ మైసమ్మ దేవాలయం వద్ద పెంజర్ల ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మైసమ్మ అమ్మవారికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...
గ్రామదేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాల ని,ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పెంజర్ల ఉపసర్పంచ్ శాంతన్ రెడ్డి,గ్రామ వార్డు సభ్యులు మామిడి భారతమ్మ,కాటం రమాదేవి, కంటికి మై బుజ్జి,కమ్మరి వేదంతా,చారి,షేక్ అర్బస్,మంద మాధవి,రాముట్ల రాములు,ఆకన్పల్లి మాధవి, మరియు దేశాల శారద,కోడిచర్ల ఉపసర్పంచ్ రాందాస్, నాయకులు బైగరి రాజు, జైపాల్,వనం జంగయ్య, పోచన్న,మంద శ్రీను,గోపాల్ నాయక్, మల్లేష్ యాదవ్,బిచ్యా నాయక్,సిద్దాపూర్ రమేష్, నరేందర్,రెడ్యా నాయక్,శివ చారి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.