

సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపిన చిట్టూరివారిపాలెం గ్రామ ప్రజలు
పయనించు సూర్యుడు సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం చిట్టూరివారిపాలెం గ్రామంలో శనివారం రూ.14 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం శంకుస్థాపన చేశారు.ప్రజాసేవయే పరమావధిగా నడుస్తున్న సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆర్థిక సౌజన్యంతో ఈ ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని,గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, మందిర రక్షణ కొరకు ఈ నిర్మాణాన్ని ఫౌండేషన్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు స్పందిస్తూ నియోజకవర్గంలో ఫౌండేషన్ అందిస్తున్న సామాజిక,ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని కొనియాడారు,ఆలయ అభివృద్ధికి ఇంతటి పెద్ద మొత్తం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వాసంశెట్టి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బేతవోలు సుబ్రహ్మణ్యం, సలాది రమేష్, జుత్తుకు శ్యాంప్రసాద్, పిల్లి రాంబాబు,కుక్కల సత్తిబాబు,దంగేటి కృష్ణమూర్తి, చీకట్ల రామకృష్ణ, కుక్కల శ్రీనివాసు, కొప్పిశెట్టి సతీష్, గ్రామ పెద్దలు చిట్టూరి సుబ్రహ్మణ్యం,గెద్దాడ శ్రీరాములు, చిత్తూరు కొండ,చిట్టూరి సత్యనారాయణ, శేషగిరి, ఒళ్ళు ఆంజనేయులు,గెద్దాడ రామకృష్ణ,శీలం అన్నవరం, దంగేటి గౌరీ శంకర్, గుబ్బల వెంకటరమణ, కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఆలయ కమిటీ ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.