

సిబ్బంది కొరతపై బిజెపి నాయకులు ఆగ్రహం
దళిత మహిళ మృతిపై జ్యుడిషియన్ ఎంక్వయిరీ చేయాలి
బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అందే బాబయ్య బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కక్కునూరు వెంకటేష్ గుప్తా
( పయనించే సూర్యుడు నవంబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వం ఆస్పత్రిని బిజెపి పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది కొరత చాలా ఉంది ప్రభుత్వ కమిషనర్ కు సిబ్బంది కొరత గురించి తెలియజేయడం జరిగిందని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి రోజు వందలాది రోగులు వస్తుంటారని వారిని చూడడానికి మాకు సిబ్బంది కొరత ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే అందే బాబయ్య మాట్లాడుతూ కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రసవానికి వచ్చిన సందర్భంగా దళిత మహిళ మృతి చెందడం చాలా బాధాకరమని దళిత మహిళ మృతి పై జ్యూడిషల్ ఎంక్వైరీ చేయాలని సిబ్బంది కొరతను ప్రభుత్వం వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి షాద్నగర్ అసెంబ్లీ మాజీ ఇంచార్జ్ డాక్టర్ టంగుటూరి విజయకుమార్ షాద్నగర్ పట్టణ కౌన్సిలర్ పేట అశోక్ మల్చల్ మురళి మఠం రిషికేష్ చెట్ల వెంకటేష్ మంగా విజయ్, గట్టు విజయ్ రమేష్ బిజెపి మహిళా మోర్చా జిల్లా స్పోక్స్ పర్సన్ రాజేశ్వరి హాజిపల్లి డిప్యూటీ సర్పంచ్ ఈసునాతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు