
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సూటి ప్రశ్నలు.. గత పదేళ్ల పాలనలో ఏం సాధించారు?
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శలు, ఆరోపణలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత పదేళ్లుగా తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలు, ప్రస్తుతం చేస్తున్న విమర్శలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించడం కంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పరిష్కరించలేకపోయారో ప్రజలకు వివరించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి అభివృద్ధికి సంబంధించి న కొన్ని కీలక అంశాలపై ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.మెట్రో పార్కులో స్టేడియం నిర్మాణం ఎక్కడ?కూకట్పల్లి మెట్రో పార్కులో యువతకు ఉపయోగపడేలా స్టేడియం నిర్మించాలనే ఆలోచన గతంలో ఎందుకు కార్యరూపం దాల్చలేదు? పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిధుల కేటాయింపు, నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు ఎందుకు ముందుకు సాగలేదు? అనే ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సి ఉంది.కేపీహెచ్బీ–జేఎన్టీయూ రోడ్డులో పెట్రోల్ బంక్ అంశంపై స్పష్టత ఏది?కేపీహెచ్బీ–జేఎన్టీయూ ప్రధాన రహదారిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు అంశం ప్రస్తుతం చర్చకు రావడం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించాలి. గత పదేళ్లలో ఈ స్థలానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అప్పట్లో ఈ అంశంపై ఎందుకు స్పందించలేదు? ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలి.రమ్య గ్రౌండ్ వద్ద ఎన్టీఆర్ పేరుతో పాఠశాల హామీ ఏమైంది?రమ్య గ్రౌండ్ సమీపంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో పాఠశాల నిర్మిస్తామని గతంలో ఇచ్చిన హామీ ఏమైంది? ఈ పాఠశాల పేరుతో మీ పార్టీకి చెందిన కార్పొరేటర్ డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఆ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలి. నిజంగా నిధుల సేకరణ జరిగి ఉంటే వాటి వివరాలు, పాఠశాల నిర్మాణ పురోగతిని ప్రజల ముందుంచాలి.నిరుపేదల సొంతింటి కలకు అడ్డంకులు సృష్టించవద్దుహైదరాబాద్ మహానగరంలో అద్దె ఇళ్ల భారంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్ఐజీ, ఎంఐజీ గృహాల నిర్మాణ ప్రతిపాదనను స్వాగతించాల్సిన అవసరం ఉంది.దాదాపు రూ.40 లక్షల విలువైన ఇంటిని రూ.6 లక్షలకే అందించాలనే ప్రతిపాదన, లక్ష మంది గృహ అవసరాలను తీర్చాలనే లక్ష్యం అమలులోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, నిధుల సమీకరణ, లబ్ధిదారుల ఎంపిక, అమలు విధానంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి.ప్రజలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడకుండా, వాటి అమలుకు ఎమ్మెల్యేగా మాధవరం కృష్ణారావు సహకరించాలి. నిరుపేదల సొంతింటి కల సాకారమయ్యేలా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.ఎమ్మెల్యే కృష్ణారావుకు ఒక సూచన..
కూకట్పల్లి ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన మాధవరం కృష్ణారావుకు రాజకీయంగా మంచి అనుభవం ఉంది. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి మరింత సమర్థ వంతంగా వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించాలి. మంచి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలి. అవసరమైతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీ రాజకీయ నిర్ణయాలను కూడా పునరాలోచించాలి.రాజకీయాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం!
కూకట్పల్లి ప్రజలకు కావాల్సింది పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలు కాదు. మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు, యువతకు క్రీడా ప్రాంగణాలు, నిరుపేదలకు సొంత ఇళ్లు, అభివృద్ధికి కొత్త అవకాశాలు.ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నా, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అందరూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉంది. గతాన్ని తవ్వుకుంటూ కాలం గడపడం కంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలి. అని అన్నారు