
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన బిజెపి మాజి బూత్ అధ్యక్షులు మూడ్ బాబునాయక్ రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వేంటనే స్పందించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఆసుపత్రి మందుల కొరకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ప్రతినెల టాబ్లెట్స్ కొరకు సహాయం అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇందూరు జిల్లా కార్యవర్గ సభ్యులు వంకరి రామరాజు, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు బేగరి శివప్రసాద్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, నర్సింగ్, బాలాజీ, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.