

పయనించే సూర్యుడుD.28.09.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.. బాల్కొండ మండలంలో MK ఫంక్షన్ హాల్లో సోమవారం మండల కేంద్రానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ"8,99,500/- వ్యవధి గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాల్కొండ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.మంజూరు అయిన చెక్కులను పట్టణ శాఖ అధ్యక్షుడు కుందారపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధితుల కుటుంబాలకు అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడారు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ కుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు, పేద,సామాన్య,ప్రజలకు అనారోగ్యంతో హాసూపత్రిలో చేరిన పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పేద కుటుంబాలకు లబ్దిచేకూరేల మెరుగైన వైద్యం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తుందని వారు తెలిపారు,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కృషి చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిలు మహమ్మద్ యూనిస్,సంజీవ్ గౌడ్,ప్రధాన కార్యదర్శిలు పుప్పాల విద్యా సాగర్, పుల్లాయి నవీన్ కుమార్,కార్యదర్శులు గడ్డం రవి, జక్క పద్మారావు,ధోన్ పాల్ సాయన్న, మార పురుషోత్తం,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెసరి వివేక్ ఆనంద్,మాజీ ఉపసర్పంచి షేక్ వాహబ్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్, నాయకులు అరేపల్లి గంగాధర్, మేక సతీష్,పిప్పెరా అశోక్,బండి మల్లేష్ యాదవ్,మెట్టు అశోక్,నానం నరేష్,తదితరులు పాల్గొన్నారు