
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ గ్రామం నుండి అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన వెంకటేశ్వర గుప్తా వారి రెవెన్యూ ల్యాండ్ లో వ్యాపార నిమిత్తం షెడ్డు ఏర్పాటు చేసుకోవడం కొరకు పనులు చేపడుతున్నారు. అంబం గ్రామానికి వెళ్లే రోడ్డును కబ్జా చేసి షెడ్డు వేస్తున్నారని, ఆ వ్యక్తికి మా గ్రామస్తులం వెళ్లి అడుగగా మీ అంబం రోడ్డు ఇక్కడ లేదు అని అతివాదంగా మాట్లాడడం జరిగిందని గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ పేర్కొన్నారు. ఈ విషయం పై శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, తహసిల్దార్ సురేందర్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశామన్నారు. రోడ్డు ఇరుకుగా లేకుండా వారి ల్యాండ్ లో షెడ్ నిర్మాణం చేపట్టే విధంగా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో గ్రామస్తులు ఉన్నారు.