

పయనించే సూర్యుడుD.7.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలోఈరోజు శనివారం రోజున భీంగల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో VB-GRAMG మెట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి భీంగల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ
40 మంది కూలీలు వచ్చినచోట ఒక మేట్ ను నియమించడం జరుగుతుందని మెట్లు వాళ్లకి అప్పగించినటువంటి విధులను మరియు బాధ్యతలు సక్రమంగా నిర్వహించి కూలీలకు పని కల్పించడంతోపాటు నాణ్యమైన పనులు జరిగే విధంగా చూడాలని తెలిపినారు నియమించబడిన మెట్లు కూలీల కు డిమాండ్ మరియు అలాకేషన్ చేయడం జాబు కార్డుల నిర్వహణ కూలీలకు సౌకర్యాలు కల్పించడం కొలతలు పెట్టడం మరియు కొలతలు తీయడం కూలీలకు రసీదులు పంచడం రోజు క్రమం తప్పకుండా హాజరు నిర్వహించడం లాంటి పనులను నిబద్ధతతో చేపట్టాలని తెలిపినారు.ఫీల్డ్ అసిస్టెంట్ తో మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ పాలకవర్గం సమన్వయంతో పని చేస్తూ గ్రామంలో ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలని ఈ సందర్భంగా తెలిపినారు.మండలంలో శిక్షణ అనంతరం బాబా పూర్ గ్రామంలో వ్యవసాయ పొలంలో నిర్మించిన ఫారం ఫండ్ పనులను సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీఓ జీ నర్సయ్య ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ టెక్నికల్ అసిస్టెంట్లు గణేష్ రమేష్ స్వామి దాస్ 27 గ్రామాల మెట్లు హాజరు అయినారు..