

పయనించే సూర్యుడు నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (సిఫార్డ్) స్వచ్ఛంద సేవా సంస్థ, బాపట్ల మరియు సీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, న్యూఢిల్లీ వారి సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని 360 కుటుంబాలకు అర్నాబ్ తుఫాన్ బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కొక్కటి సుమారు రూ.3000/- విలువ గలిగిన హైజీన్ మరియు షెల్టర్ కిట్స్ అందించడం జరిగింది. ఈ కిట్స్ లో నిత్యావసర వస్తువులు, పరిశుభ్రతకు అవసరమైన సామగ్రి, తాత్కాలిక ఆశ్రయానికి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. తుఫాన్ కారణంగా ఇళ్లు, ఆస్తులు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సిఫార్డ్ సంస్థ డైరెక్టర్ కె. రవి ప్రదీప్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో బాధిత కుటుంబాలకు సహాయం అందించడం తమ బాధ్యతని, కాట్రేనికోన పంచాయతీలో తమ సంస్థ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా బాధిత ప్రాంతాల్లో పునరావాసం, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మాజీ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, సిఫార్డ్ కోఆర్డినేటర్ బడుగు కిషోర్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు మరియు సంస్థ వాలంటీర్లు పాల్గొన్నారు.