
పయనించే సూర్యుడు నవంబర్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల రైతు సేవా కేంద్రం నందు మంగళవారం మండల వ్యవసాయ అధికారి హిమబిందు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ రైతులకు అవగాహన కల్పించి పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్. సిరాజుద్దీన్ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే రబీ సీజలకు సంబంధించిన యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక ఎకరాలకే మూడు బస్తాలు చొప్పున యూరియా రైతులకు అందించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి రైతుల యూరియా కార్డు లు ప్రతి వ్యవసాయ రైతుకు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం లో రావి పెంచల రెడ్డి. బి. వీర రాఘవరెడ్డి. మండల వ్యవసాయ అధికారి పి. హిమబిందు, ఏ ఈ ఓ. సుజాత. వి ఏ ఏ ఎస్ . మేఘన వర్షిణి, చెంచయ్య రైతులు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
