
ఐక్యంగా పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సీనియర్ నాయకుల నిర్ణయం.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా కృషి చేయడంతో పాటు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగాలని నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా సీనియర్ నాయకులందరూ ఒకే వేదికపైకి వచ్చి ఐక్యంగా పనిచేయాలని సంకల్పించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలవాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాధు ప్రతాప్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంజీవరావు, సీనియర్ నాయకులు సీహెచ్ కొండల్ రెడ్డి, కార్పొరేటర్‌గా పోటీ చేసిన విట్టల్ రెడ్డి, అబ్దుల్ బాకీ, మాజీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణ రాజ్‌పుత్, రాజశేఖర్ రెడ్డి, సుంకన్న, గోవింద్ గౌడ్, ఎస్సీ సెల్ నాయకుడు రాము, మైనారిటీ సెల్ నాయకులు చోటా మొయిజ్, షేక్, నాగేశ్వరరావు, నరేష్, వెంకటేష్ యాదవ్, మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.