

ప్రయాణించే సూర్యుడు నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగాం: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు జన్మదినం సందర్భంగా ఆయన స్వగ్రామమైన మాగాంలోని శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక లక్ష పత్రి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రోచ్చరణలతో మారుమోగింది. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, గ్రామ సొసైటీ అధ్యక్షులు వేటుకూరి రమేష్ రాజు, వేటుకూరి శ్రీనివాసరాజు, అల్లవరపు సోమయాజులు, అల్లవరపు చక్రవర్తి, గొల్లకోటి కృష్ణారావు తదితరులు సూర్యనారాయణ రాజును శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలను నేతలు కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భక్తులు, గ్రామస్తులు స్వామివారిని ప్రార్థించారు. గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు.