

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.