
పయనించే సూర్యుడు న్యూస్, సెప్టెంబర్ 24 బాచుపల్లిలోని మైస్పేస్-2లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం గణనాథుడి లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేలం పాట సందడి వాతావరణంలో సాగింది.వేలం పాటలో పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరకు సంధ్యా వెంకట రెడ్డి రూ.15 లక్షల 10 వేల రూపాయలకు గణనాథుడి లడ్డూను కైవసం చేసుకున్నారు.అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్న సంధ్యా వెంకట రెడ్డికి ఉత్సవ నిర్వాహకులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నాయకుడి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.మైస్పేస్-2లో జరిగిన ఈ వేలం పాట స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల ఐక్యత, ఆధ్యాత్మిక భావనతో పాటు ఉత్సవాల పట్ల ఉన్న ఆసక్తికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.