
పయనించే సూర్యుడు గాంధారి 29/09/26 తిప్పారం తండా మరియు పరిసర గ్రామాలు మరియు తాండవాసులకు మండల కేంద్రానికి వెళ్లడానికి అనేక అవస్థలు పడుతున్నారు. అలాగే రోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు రవాణా సౌకర్యం లేక రోడ్లపైన రవాణా సౌకర్యం కోసము ఇతరుల సహాయం కోసము ఎదురుచూస్తున్నారు. దాదాపు గాంధారి నుండి సోమవారం కొత్తవాది మీదుగా పెద్ద గుజ్జులు పిస్కిల్ గుట్ట వరకు మొత్తం 13 గ్రామాలు కలవు. దాదాపు 80 మంది పిల్లలు పాఠశాలకు దూరమవుతున్నారు. కనుక వారికి రవాణా సౌకర్యం కల్పించి విద్యా అందే విధంగా కృషి చేయగలరని మాజీ సర్పంచ్ బిషన్ నాయక్, బిచ్చం నాయక్, పెంటయ్య మరియు రమేష్ తదితరులు అసిస్టెంట్ మేనేజర్ శంకరయ్య వేడుకోవడం జరిగింది. ఇలాంటి వినతి పత్రాలు రెండు నెలల లోపల మొత్తం మూడు అందించడం జరిగింది. అయినా మేనేజర్ మా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించకపోవడం చాలా బాధాకరమని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ సమస్యను ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే కృషిచేసి తమ గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించి విద్యార్థులకు మరియు ప్రయాణికులకు మేలు చేస్తారని కోరుకుంటున్నాం. ఈ అభ్యర్థనను పరిష్కరించని ఎడల మేము మండల కేంద్రంలో ధర్నా చేయడానికి వెనుకాడబోమని తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాడుతామని తెలిపారు.