
పయనించే సూర్యుడు నవంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు సూచనలతో మండల కేంద్రమైన చేజర్ల చెన్నకేశవ స్వామి ఆలయమునందు బుధవారం సమావేశాన్ని నిర్వహించి పార్టీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి , మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి . మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ . ఆధ్వర్యంలో చేజర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి . మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు