
పయనించే సూర్యుడుD.18.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. భీంగల్ మండలం మెండోరా గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 15వ వార్షికోత్సవ వేడుకల్లో బీజేపీ భీంగల్ మండల అధ్యక్షుడు అరే రవీందర్ మరియు మాజీ ఎంపీపీ కొండా గోదావరి ప్రకాష్ గౌడ్ లతో కలసి బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గౌడ సంఘం సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భావితరాలకు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పార్వతి శ్రీనివాస్, బొడిగే లింబాద్రి, మ్మల రాజేశ్వర్ గౌడ్, ch శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, మల్లేష్ గౌడ్, బాల కృష్ణ, ప్రేమగౌడ్, కోటేశ్వర్, తిరుపతి గౌడ్, పొన్నం శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, వాల్గోట్ బావన్న, బీజేపీ నాయకులు నాగార్జున్, గాడి వేణు, బాబూరావు, తక్కూరి రామ్, ఆదిత్యా గ్రామస్థులు పాల్గొన్నారు..