
పయనించే సూర్యుడుD.28.09.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. ఎన్ఎస్యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ భీమ్గల్: ఎన్ఎస్యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను భీమ్గల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్ అని అన్నారు. ఆయన ధైర్యం, దేశభక్తి, త్యాగం నేటి యువతకు, విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.నేటి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సయ్యద్ రెహమాన్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దేశం కోసం కలలు కన్న భగత్ సింగ్ వంటి మహనీయుల స్ఫూర్తితో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, విజ్ఞానం, క్రీడలు మరియు సామాజిక సేవ వైపు అడుగులు వేయాలని సూచించారు.విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. “మత్తుకు దూరం.. లక్ష్యానికి చేరువ” అనే నినాదంతో ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని భగత్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు.