
రుద్రూర్, పయనించే సూర్యుడు నవంబర్ 18, : రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నిజామాబాద్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్ర శేఖర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, నిపుణులైన సూపర్ స్పెషాలిటీ వైద్యులతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో గుండె, కిడ్నీ, నరాలు, ఎముకలు, స్త్రీల వ్యాధులు, పిల్లల వైద్యం, ఈఎన్టీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు రోగులను వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ హాస్పటల్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.