
రుద్రూర్, పయనించే సూర్యుడు నవంబర్ 18, న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం అర్హులైన లబ్ధిదారులకు చేయుత పెన్షన్ ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మండలంలో మొత్తం 369 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని తెలియజేశారు. తెలంగాణలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ విజయ లక్ష్మి, ప్రత్యేకాధికారి అరవింద్ రెడ్డి, ఇంచార్జ్ ఎంపిడిఓ హరి ప్రసాద్ గౌడ్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజీ గంగారం, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు తోట సంగయ్య, రాయకూర్ మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్, రాయకూర్ మాజీ విండో చైర్మన్ సంగమేశ్వర రావు, ఐకేపి ఏపిఎం బస్వంతు రావు, సర్పంచులు చిక్కడపల్లి సర్పంచ్ మచ్కురి రమేష్, అక్బనగర్ సర్పంచ్ రాంబాబు, రాణంపల్లి సర్పంచ్ కొండలవాడి శంకర్, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు , వివిధ శాఖల అధికారులు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.