
రుద్రూర్, పయనించే సూర్యుడు నవంబర్ 19 న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ భారతి రీ-సర్వే ప్రక్రియలో భాగంగా రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామ శివారులో గురువారం భూ భారతి రీసర్వే కార్యక్రమాన్ని బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు 30 ఎకరాలు తగ్గకుండా, డిసెంబర్ 15వ తేదీ నిర్దేశిత గడువులోపు సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆర్డిఓ వెంట తహసిల్దార్ సుధీర్, ఆర్ఐ భారతి, రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.