
పయనించే సూర్యుడు నవంబర్ 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గ పరిధి లో పురపాలక సంఘం వారిచే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రపంచ టాయిలెట్ దినోత్సవం చేశారు ఈ కార్యక్రమంలోని నీటి మీద రాతలాగా హంగు ఆర్భాటాలకే సరిపోతుంది తప్ప ఆచరణ మాత్రం లేదు ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి అధికారులు ఆలోచించాలి శ్రీనగర్ కాలనీ ఎదురుగా ఉన్న మరుగుదొడ్లు పనిచేసి ఎన్నో సంవత్సరాల అవుతుంది అలాగే చెంగాలమ్మ గుడి పక్కన ఉన్న మరుగుదొడ్ల పరిస్థితి దేవుడికే తెలియాలి ఆర్భాటాలకు మాత్రం కార్యక్రమాలు చేస్తారు సూళ్లూరుపేటకి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు పనిమీద వస్తుంటారు అలాంటి వారికే మరుగుదొడ్లే కనిపించట్లేదని మాట్లాడుకుంటూ వెళుతుంటారు ఇదేనా సూళ్లూరుపేట లో ఉంటున్న మున్సిపాలిటీ వారి నిర్వహించే టాయిలెట్ దినోత్సవం ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్న అవి మీ కంటికి కనిపించవా కార్యక్రమాలు మాత్రం గొప్పగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు ఇదెక్కడిన్నాయం అని సూళ్లూరుపేట ప్రజలు అనుకుంటున్నారు సురక్షిత మరుగుదొడ్లు అయ్య ఎక్కడున్నాయో మున్సిపాలిటీ అధికారులు బహిరంగంగా తెలియపరచాలి బాలికలు మరియు మహిళలు గౌరవం భద్రత ఆరోగ్యం మాట దేవుడెరుగు మహిళలకి బాలికలకి సురక్షితమైన మరుగుదొడ్లు ఎక్కడున్నాయి ఉన్న వాటిలో శుభ్రత శూన్యం వీటన్నిటిని ఆచరణలో పెట్టి అప్పుడు టాయిలెట్ దినోత్సవం చేయాలి కదా అని సూళ్లూరుపేట ప్రజల అనుకుంటున్నారు