
కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ప యనించే సూర్యుడు, నవంబర్ 20,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ శ్రీ బానోత్ సదర్ లాల్ రిబ్బన్ కటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీడీవో ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు కలిగిన ప్రత్యేక కుటుంబాలు ఈ పథకానికి అర్హులని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా వెనుక ఉన్న కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇటువంటి జీవిత బీమా పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి అర్హులైన కుటుంబం ఈ పథకంపై అవగాహన కలిగి ఉండాలని, నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రజలందరికీ ఈ పథకంపై అవగాహన కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీ తుళ్లూరి ప్రకాశరావు, వార్డు సభ్యులు వేములపల్లి హసిత, కోర్స ముత్తమ్మ, చింతల అనుపమ, చెట్టుపల్లి రమాదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.