
రుద్రూర్, పయనించే సూర్యుడు .23.11.2026 న్యూస్ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం గ్రామ సర్పంచ్ కొండలవాడి శంకర్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల సహకారం కావడంతో వారి కళ్ళల్లో ఆనందం కనబడుతొందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం దశలవారీగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మోహన్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు తోట సంగయ్య, నాయకులు నెరుగంటి బాలరాజు, షాదుల్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.