
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజా అవసరాల నిమిత్తం కేటాయించిన భూములను ప్రభుత్వం వేలం వేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, ప్రజల తరఫున భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఒక వైపు హైడ్రా ద్వారా భూ కబ్జాదారుల నుండి భూములను కాపాడడం హర్షనీయం , కానీ మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజల అవసరాల నిమిత్తం కేటాయించిన హౌసింగ్ బోర్డు స్థలాలను మరియు కూకట్‌పల్లిలోని ట్రక్ పార్క్‌ను ప్రభుత్వం వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణం అని అన్నారు. కూకట్ పల్లిలో నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పటిల్ లేక ప్రజలు,ఆట స్థలాల లేక యువత ఇబ్బందులు పడుతున్నారని ఉన్న స్థలాన్ని పెయిడ్ గ్రౌండ్స్ గా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని అన్నారు నియోజకవర్గం లోని భూములను ప్రజా సౌకర్యదం ఉపయోగించాలని, భూముల వేలం విషయం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ అధికారుల తీరును మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమానికి, భూముల పరిరక్షణకు భంగం కలిగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసి వేలం ప్రక్రియను అడ్డుకోక తప్పదని హెచ్చరించారు.