
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న పాకిస్తాన్లో ఆందోళనను మరింత పెంచింది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇస్లామాబాద్ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించినప్పటికీ, ఇద్దరు నాయకులు భారతదేశంపై దృష్టి సారించారు.ఢిల్లీ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నిన్నటి వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు. ఇప్పుడు దీనిని విదేశీ కుట్రగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు. భారతదేశం ఎప్పుడైనా పాకిస్తాన్‌ను నిందించవచ్చాలని చూస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని మరోసారి బెదిరించేందుకు ప్రయత్నించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. “పాకిస్తాన్ రెండు వైపులా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. తూర్పు-పశ్చిమ సరిహద్దులలో రెండు వైపులా పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొదటి రౌండ్లో అల్లాహ్ మాకు సహాయం చేశాడు. రెండవ రౌండ్లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడు.” అంటూ ఖవాజా హెచ్చరించారు. పాకిస్తాన్ తన తూర్పు సరిహద్దును భారతదేశంతో పంచుకుంటుంది. పశ్చిమ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్‌తో ఉంది. దీనిపై రక్షణ మంత్రి ఖాళీ బెదిరింపులు జారీ చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్ ఆందోళన సమర్థనీయమే. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోషులను వదిలిపెట్టబోమని ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపారు. దీని తర్వాత, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇంతలో, ఢిల్లీ బాంబు దాడుల తర్వాత, దోషులు ఎవరైనా తప్పించుకోబోరని ప్రధానమంత్రి మోదీ భూటాన్ నుండి ప్రపంచానికి సందేశం పంపారు.