
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ట్రాన్స్ కో 1104 యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కూకట్ పల్లిలోని అడ్డగుట్టకు చెందిన కమ్మిలి సునీత నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.సాయిబాబా నుంచి సునీత నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి వెంకటేశ్వర్లు, జి.సాయిబాబా, ట్రాన్స్ కో ప్రెసిడెంట్ ఎం.తులసీరాం, వర్కింగ్ ప్రెసిడెంట్ సి.నాగరాజు, అనుబంధ కార్యదర్శి కె.రామచంద్రం, సెక్రటరీ ఎన్.బాలకృష్ణకు సునీత కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని విధ్యుత్ కార్మికుల పక్షాన న్యాయమైన సమస్యలపై గళమెత్తి పొరాడటానికి గ్రేడ్ వన్ ఆర్టిజన్ గా మెట్రో వెస్ట్ సర్కిల్లో ఎస్.ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోన్న కమ్మిలి సునీతను 1104 యూనియన్ తరుపున ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, కార్మికుల తరుపున సంస్థ అభివృద్దికి, ఉధ్యోగుల సంక్షేమం కోసం మరియు దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టిసన్ సమస్యలపై పోరాటం చేస్తానని సునీత ప్రకటించారు.