
పయనించే సూర్యుడు నవంబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఈరోజు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్టా సత్తిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి పుట్టినరోజు వేడుకలుకు ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు పాల్గొని నాయకులు కార్యకర్తలు మధ్య భారీ కేక్ కట్ చేసి ఆయనకు సాలువా కప్పి పుష్పగుచ్చాలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బుచ్చిబాబు మాట్లాడుతూ సాయి పార్టీలో బాధ్యతతో పార్టీలో పని చేస్తూ ప్రతి ఒక్కరికి జిల్లాలో అందుబాటులో ఉండి పార్టీ కోసం సేవలు అందిస్తున్నారని సాయికి ఇంకా ఉన్నత పదవులు రావాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని బుచ్చిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుత్తులు సాయికి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, ములపర్తి బాలకృష్ణ, విల్ల వీరాస్వామి నాయుడు,గొల్లపల్లి గోపి, రెడ్డి సుబ్బారావు, ఎస్ఎంఎస్ ప్రసాద్, నిమ్మకాయల విషు , బడుగు సందీప్ సాయి, సానబోయిన దుర్గాదేవి, దొమ్మేటి వెంకటేశ్వర్లు,పిల్లి నాగరాజు, కడలి నాగు, జాగు సత్తిబాబు, సానబోయిన చంటి, కాకి మాణిక్యం, అబ్బాస్, రెడ్డి బాలకృష్ణ, బడుగు రవి, కటికిదల నాని, అఖిల్, కౌన్సిలర్స్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
