
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కడియాల కుంట తండాలో ప్రారంభం
పాల్గొన్న సిడిపిఓ షాద్నగర్ ఉదయ మరియు డబ్ల్యూ సి డబ్ల్యూ డిపార్ట్మెంట్ షబానా హుస్సేన్
ఐసిడిఏ సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడి టీచర్ సుజాత
( పయనించే సూర్యుడు నవంబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాలకుంట తండలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో నిర్మించిన నూతన అంగన్వాడి భవనాన్ని ఈరోజు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎన్నారై డాక్టర్ అలోక్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. తాండ కు చెందిన విద్యార్థులకు ఎన్నో రోజుల నుండి అంగన్వాడి భవనం లేకపోవడంతో అద్దె భవనాల్లో అంగన్వాడి నిర్వహణ జరుగుతుంది. దీంతో సంవత్సరం క్రితం ప్రగతి వెల్ఫేర్ సొసైటీ వారికి అడగగా వారు తమ సొంత నిధులతో భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అందించడం జరిగింది. అనంతరం సిడిపిఓ ఉదయ మాట్లాడుతూ… అంగన్వాడి భవనాన్ని నిర్మించినందుకు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అలోక్ అగర్వాల్ ను విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే విధంగా తమ యొక్క సహాయ సహకారాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అలోక్ అగర్వాల్ తో పాటు సిడిపిఓ ఉదయ మరియు జనరల్ సెక్రటరీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ షబానా హుస్సేన్ మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, స్కూల్ హెడ్మాస్టర్ శరత్, కాశిరెడ్డిగూడ మాజీ సర్పంచ్ దీన శంకర్, కడియాల కుంట తండా మాజీ డిప్యూటీ సర్పంచ్ రెడ్యానాయక్ , ప్రైమరీ స్కూల్ చైర్మన్ మన్ని శ్రీను నాయక్ మరియు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు
