
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియవర్గంలో భీంగల్ మండల కేంద్రంలో
బీహార్ ఎన్నికలలో బిజెపి పార్టీ మరియు డి ఏ కూటమి విజయ దుందుభి మోగించిన సందర్భంగా బిజెపి భీంగల్ పట్టణ మరియు రూరల్ శాఖ ల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది,
సంబరాల అనంతరం భీంగల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ మాట్లాడుతూ బీహార్ లో ఎన్ డి ఏ కూటమి విజయ దుందుభి మోగించడంతో సంబరాలు నిర్వహించామని ఎన్ డి ఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నీన ఎన్నికల సమయంలో ఉగ్ర దాడులు జరిపి బిజెపి మీద నెపం వేద్దామనుకున్న ఉగ్ర మూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బిజెపి వైపు నిలబడ్డందుకు బిజెపి తరుపున ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ యోగేశ్వర నరసయ్య, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ,ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ,యువమోర్చా అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, సీనియర్ నాయకులు సంధ్యా రాజు భీంగల్ సర్వసమాజ్ కోశాధికారి కాపు కుమారి హరీష్, కొట్టాల అశోక్,తక్కురి అంజయ్య, పతాని ప్రవీణ్, ప్రమోద్, బీరువాల లక్ష్మీనారాయణ,తక్కురి సాయి రెడ్డి,కుండల అన్వేష్,సంగ్ సాయి, బొదురే మోహన్,ఆరోల్ల నరసింహ, భూత్ అధ్యక్షులు మండల, పదాధికారులు పాల్గొన్నారు..
