
పయనించే సూర్యుడు నవంబర్ 14 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేవిద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి,నేటిబాలలేరేపటపౌరులు.తల్లితండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు,రైతు బిడ్డలు, వివిధ రకాల వృత్తి చేసి మిమల్ని చదివిస్తున్నారు
చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి, చదువే మిమల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మీకు మీ తల్లితండ్రులకు సమాజంలో ఒక గొప్ప గౌరవాన్ని సంపాదిస్తుంది.క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యం అనేది ఉండదు,, సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నానంటే క్రమశిక్షణ, పట్టుదల ఒక కారణం. ఇవన్నీ మిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ PACS చైర్మన్ లక్కినేని సురేందర్ టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ S. I రాజేందర్ , బోడు S. I శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్యానాయక్, భద్రు,బానోత్ రవి,పుణ్యా, నవీన్, కుమార్, భూక్యా సర్దార్,శేఖర్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.