
పయనించే సూర్యుడు న్యూస్ :హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే సూచనలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శుక్ర, శని వారాల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేసేసింది. తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం చవిచూసింది. వేల ఎకరాల్లో పంటలు, ఆస్తి నష్టం జరిగింది. ఇక తుఫాన్ ఎఫెక్ట్ నుంచి తెరుకుంటున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో పొడి వాతావరణం ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు గురువారం వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వరికొతలు జరిగే సమయం కాబట్టి రైతులు ధాన్యం తడవకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది. అలాగే ప్రధాన నగరాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని.. ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని కోరింది.