
పయనించే సూర్యుడు నవంబర్ 6 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మెప్మా అధికారులపై కేసులు - కంప్లైంట్ లో పొందుపరిచిన వారిని విధుల నుంచి తొలగించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ తిరుపతి (నగర పాలక సంస్థ ) : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా సంఘాల బాగోతం రోజురోజుకు చర్చనీయాంశమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈ మురళి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో పనిచేసే రిసోర్స్ పర్సన్స్ సంఘాల్లోని మహిళల పొదుపు, బ్యాంకు రుణాలు స్వాహా చేయడం పరిపాటిగా మారిందని ఇటీవల ఓ కమ్యూనిటీ ఆర్గనైజర్ (సి.ఓ) పదిమంది బినామీ వ్యక్తులతో ఓ మహిళా సంఘాన్ని సృష్టించి వారికి 20 లక్షల బ్యాంకు రుణాన్ని ఇప్పించేందుకు ప్రయత్నిస్తూ బ్యాంకు అధికారులకు దొరికిపోయారు. పై విషయాన్ని మెప్మా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఏమాత్రం కూడా వారిపై చర్యలు తీసుకోకపోవడమే మిగిలిన వారికి ఆదర్శంగా మారింది. గతంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు టిఎల్ఎఫ్ లు ఉన్నాయని ఆ నాలుగు టిఎల్ఎఫ్ లో అవినీతి జరిగినట్లుగా అనేక దఫాలుగా వార్తాపత్రికల్లో వచ్చిన విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిరుపతి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. పై విషయానికి సంబంధించి కార్పొరేషన్ అధికారులు ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆడిట్ కమిటీలో బహిర్గతంగా పత్రికల్లో వారి దగ్గర ఎటువంటి పుస్తకాలు లేవని, ఖర్చుపెట్టిన వాటికి రసీదులు లేవని, అవకతవకలు జరిగాయని ఆ కమిటీ నిర్ధారణలో తేలినప్పటికీ వారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలకు నిదర్శనం.కొర్లగుంట సమీపంలో నౌహిర (రిసోర్స్ పర్సన్) ఒక కోటి 20 లక్షల రూపాయల స్వాహా చేసినట్లుగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సంఘ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనతోపాటు కొంతమంది అధికారులు కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లుగా ఆ కంప్లైంట్ లో వారి పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. A1) నౌహీరా (రిసోర్స్ పర్సన్) A2) ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ధనుంజయలు, A3) మెప్మా CMM కృష్ణవేణి, A4) మెప్మా CO అమ్మాజీ, A5) Ex - CO ప్రమీల, A6) రెడ్డెమ్మ, A7) వసంత, A8) పాతిమా, A9) లత, A10) ప్రసన్న పై తెలిపిన పదిమందిపై ఎఫ్ ఐ ఆర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు రిజిస్ట్రేషన్ అయినట్లుగా తెలియజేశారు. ఇందులో మెప్మా పరిధిలో పనిచేసే అధికారులు ఎవరు ఉన్నా సరే వారందరినీ సస్పెండ్ చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విజిలెన్స్ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. అప్పటివరకు కంప్లైంట్ లో ఉన్న మెప్మా ఉద్యోగులను విధులనుండి నుండి తొలగించాలి. విచారణ అనంతరం వారు నిర్దోషులుగా నిరూపించబడితే తిరిగి విధులలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్, మెప్మా పీడీ స్పందించాలి. స్పందించని ఎడల నష్టపోయిన డ్వాక్రా సంఘాల మహిళలను కూడగట్టుకొని పోరాటానికి రూపకల్పన చేస్తామని పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు.పి. మురళి సిపిఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి.